తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 26 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 22వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, నవంబరు 25న లక్ష కుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల కారణంగా నవంబరు 22న, నవంబరు 25 నుంచి డిసెంబరు 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
బ్రహ్మోత్సవాల వాహనసేవల వివరాలు
తేదీ ఉదయం రాత్రి
26-11-2016(శనివారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం
27-11-2016(ఆదివారం) పెద్దశేషవాహనం హంసవాహనం
28-11-2016(సోమవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
29-11-2016(మంగళవారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
30-11-2016(బుధవారం) పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం గజవాహనం
01-12-2016(గురువారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం, గరుడవాహనం
02-12-2016(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
03-12-2016(శనివారం) రథోత్సవం అశ్వ వాహనం
04-12-2016(ఆదివారం) పల్లకీ ఉత్సవం, పంచమీతీర్థం ధ్వజావరోహ