దేశంలో తెలంగాణ నెంబర్‌ 1

281
KCR address public meeting in Medak
- Advertisement -

మెదక్ జిల్లా బిడ్డగా తెలంగాణ సాధించినా అని తెలిపారు సీఎం కేసీఆర్. హవేలిఘనపూర్ మండలం ఔరాంగాబాద్ శివారులో నూతన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల భవన సముదాయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సీఎస్‌ఐ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన సీఎం… మెదక్ జిల్లా కావడం…ఇవాళ ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వం చేసే ప్రతిపనిని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని చూసి యావత్‌ దేశమే ఆశ్చర్యపోతుందన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ ముందుకు పోతుందన్నారు. వంద రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వమే సాగు,తాగునీటిని ఉచితంగా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా అందిస్తామని చెప్పారు. రైతు బంధు పథకాన్ని కరీంనగర్‌ నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని…అంధకారం అవుతుందని ప్రచారం చేశారని కానీ ఆ పరిస్థితిని అధిగమించామని చెప్పారు. నాడు కరెంట్ ఉంటే వార్త….నేడు కరెంట్ పోతే వార్త అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన జీవిన విధ్వంసంలో ఘణపురం ఆనకట్టే సజీవ సాక్ష్యమని చెప్పారు. తెలంగాణ వచ్చాక రూ. 100 కోట్లతో ఘణపూరం ఆనకట్టను పూర్తి చేశామన్నారు. ఘణపురం ఆనకట్ట ఎత్తును పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఈ సంవత్సరం చివరికి కాళేశ్వరం నీళ్లు మెదక్‌కు వస్తాయని చెప్పారు. నారయణఖేడ్,జహీరాబాద్ నియోజకవర్గాలకు సింగూరు నీళ్లు అందించి లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. దేశంలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలవబోతుందని..ఇక విద్యుత్ కొతలు ఉండవన్నారు. మంజిరా నదిపై 10 చెక్ డ్యాంలు కడుతామని చెప్పారు. మిషన్ కాకతీయతో రాష్ట్రంలో 44 వేల చెరువుల పునరుద్దరణ చేపట్టామన్నారు.

siddipet kcr

గతంలో 200 పెన్షన్ ఉంటే 1000 రూపాయలకు పెంచామని చెప్పారు. చేనేత కార్మికులకు 50శాతం సబ్సీడి ఇస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ కిట్,కల్యాణ లక్ష్మీ,గురుకుల పాఠశాలలు ప్రారంభించామని చెప్పారు. భూముల ప్రక్షాళన ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. 57 లక్షల మంది రైతులకు పంటపెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుందని చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని మరోసారి స్పష్టం చేశారు.అందరి కృషితో అద్భుతాలు సాధిస్తున్నామని తెలిపారు.

ప్రతిపక్షాలు దుర్మర్గంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు కేసీఆర్. మంచి జరిగితే ఎక్కడ వారికి స్ధానం ఉండదోనని ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ,2 పార్లమెంట్ స్ధానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం. జూన్ 2 నుంచి విప్లవాత్మకమైన అద్భుతమైన రిజిస్ట్రేషన్ రాబోతుందని ప్రకటించారు సీఎం. ధరణి అనే వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ వివరాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ముస్లిం షాదిఖానా కోసం రూ. కోటి, మెదక్‌లో వంద పడకల ఆస్పత్రికి 300 పడకల ఆస్పత్రికి అప్ గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు 85 స్ధానాల్లో డిపాజిట్ వచ్చే పరిస్ధితి లేదన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు మీరే సాక్ష్యం అన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు రావాలన్నారు. కాంగ్రెస్,బీజేపీలు ప్రజల బ్రతుకుల్లో మార్పులు తేవడంలో అట్టర్ ఫ్లాప్‌ అయ్యాయని తెలిపారు.

- Advertisement -