హరిత విప్లవానికి కేంద్రబిందువుగా తెలంగాణ

237
TRS is becoming more stronger: KTR
- Advertisement -

మరో హరిత విప్లవానికి తెలంగాణ కేంద్ర బిందువు కాబోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లాకు చెందిన కూడా మాజీ ఛైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్‌ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు.వారందరికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇవాళ చేరిన నాయకులతో టీఆర్ఎస్ బలోపేతమైందన్నారు కేటీఆర్.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తిచేసుకుని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు పోతుందన్నారు. కరెంట్ కష్టాలను అధిగమించి రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో దేశం అబ్బురపోతుందన్నారు.

భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో కరెంట్ దిక్కులేదన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణను నిర్వీర్యం చేశారని తెలిపారు. సమైక్యపాలనలో ఆరు గంటల కరెంట్ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. రైతులను కాల్చిచంపిన ప్రభుత్వం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఇప్పడేమో రైతులపై
ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతన్నల పరిస్థితి మారిందన్నారు. రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు.

ఎరువులు,విత్తనాలను టైంకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు అమలు చేస్తున్నామని తెలిపారు. నాలుగేండ్లలో 17 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం ఉన్న గోదాంలను కట్టామని చెప్పారు. రైతు బాగోగుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఉంటే వారి జీవితాలు బాగుపడతాయని చెప్పారు. దేశం మొత్తం అబ్బురపడే విధంగా
విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. స్వతంత్ర్య భారతంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచనను సీఎం కేసీఆర్ చేశారని…రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. ఎకరానికి 8 వేలు అందించనున్నామని చెప్పారు.

కేంద్రహోం మంత్రి రాజ్ నాథ్‌ సింగ్‌..రైతు బంథు పథకాన్ని మెచ్చుకున్నారని చెప్పారు. దేశం మొత్తం రైతు బంధు పథకాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. గత ప్రభుత్వాలు రైతులకు చుక్కలు చూపిస్తే…తెలంగాణ ప్రభుత్వం చెక్కులు ఇస్తోందన్నారు. టీఆర్ఎస్‌ది రైతు బంధు ప్రభుత్వమన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలు సాగులోకి వస్తుందని
తెలిపారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ….కోటి ఎకరాల మాగాణి అని స్పష్టంచేశారు కేటీఆర్. ఎంతమంది అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

దేశలో తెలంగాణ ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలవనుందని చెప్పారు. రైతులను సంఘటితం చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయని…స్వామినాథన్ కమిటీ ఇదే తెలిపిందన్నారు. రైతు సమన్వయ సమితి ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులను సంఘటితం చేస్తోందన్నారు.

- Advertisement -