మోడీ ప్రచారంతో.. కర్ణాటకలో మారిన సీన్…

269
- Advertisement -

కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అక్కడ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు… నేడు ఆ మాట చెప్పేందుకు తడబడుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి ముందు నుంచి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు కన్నడిగులు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యిందని చెబుతున్నారు.

Karnataka Elections- 2018 PM Modi Effects

కారణం మోడీ పర్యటన, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొన్నప్పటి నుంచి ఒక్కసారిగా రాజకీయ పరిమాణాలు మారిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ సుడిగాలి పర్యటనతో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరిగాయని అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందంటున్నారు.

ఇప్పటి వరకు పలు సర్వేలలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవరిస్తుందని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ 41%, బీజేపీకి 33%, జేడీఎస్ కి 23% మంది మద్ధతు పలికారని పలు సంస్థల సర్వేలు వెల్లడించాయి. ఈ లెక్కన కాంగ్రెస్‌కు 100 సీట్లు, బీజేపీకి 85, జేడీఎస్‌కు 41 స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. మోడీ రెండవ విడత ప్రచారానికి ముందు అందరూ ఈ ఫలితాలపై ఫిక్స్ అయ్యారు. కానీ తాజాగా పరిస్థితులు మారిపోయాయి.

Karnataka Elections- 2018 PM Modi Effects

ఇప్పటి వరకు మోడీ 13 ప్రచార సభల్లో పాల్గొని.. తన మాటలతో ఓటర్లను తనవైపు తిప్పుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సందించారు. ప్రధాని మోడీ ఇంకో 8 ర్యాలీల్లో పాల్గొనాల్సి ఉంది. ఆ ర్యాలీలతో కన్నడిగులను పూర్తిగా తనవైపు ఆకర్షితులు కావచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మోడీ చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ నేతలు ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మరీ కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తుందా..? లేదా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

- Advertisement -