తెలుగు చిత్ర పరిశ్రమలో రిలీజ్ అయిన మొట్టమొదటి బయోపిక్ మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి యూఎస్ లో ప్రీమియర్ షోస్ కి మంచి రెస్పాన్స్ రాగా భారీ ఓపెనింగ్స్ కూడా రాబట్టింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ ని చూస్తుంటే సావిత్రిని మళ్లీ చూస్తున్నట్లు ఉందంటున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటన అభినందనీయమని చెబుతున్నారు.

ఇక సావిత్రి భర్త జెమిని గణేశన్ గా దుల్కర్ సల్మాన్ వారి పాత్రలతో ఒదిగిపోయారని ఫ్యాన్స్ చెబుతున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని… దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని అంటున్నారు. ఇక మధురవాణిగా సమంత, విజయ్ ఆంటోనిగా విజయ్ దేవరకొండ తమ నటనతో ఆకట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ పరంపరలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ తెరకెక్కిస్తుండగా…మరో మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బయోపిక్ ను కూడా తెరకెక్కనుంది. మొత్తంగా మహానటి తర్వాత టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతుందని చెప్పడంలో సందేహం లేదని పలువురు చెబుతున్నారు.

