రెచ్చిపోయిన సమంత..

202
Samantha, Chaitanya Create Flutters in Pub
Samantha, Chaitanya Create Flutters in Pub
- Advertisement -

చాలా కాలం పాటు తమ ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన సమంత, నాగచైతన్యలు ఇప్పుడు అన్ని విషయాలు పబ్లిక్ గా మాట్లాడేస్తున్నారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా ప్రకటించిన ఈ జంట పబ్లిక్‌గానే తిరుగుతున్నారు.

కొంతకాలంగా అడపాదడపా జంటగా కనబడుతూ హల్ చల్ చేస్తున్న శామ్-చైతు ప్రేమమ్ సినిమా హిట్ తో మరింత జోరుపెంచారు. ఓ పబ్ లో వీరిద్దరూ నృత్యాలు చేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రేమమ్ సినిమాతో కెరీర్ లోనే అతి పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య.. ఆ సంతోషాన్ని సమంత, ఇంతర స్నేహితులతో కలిసి పంచుకున్నారు. వీరంతా ఓ పబ్లో చేరి ఆనందంగా చిందులేశారు. చైతూ ఆనందమే తన జీవితమని ఎప్పుడూ చెప్పే సమంత.. అందరికంటే ఎక్కువ.. అలిసిపోయేంతగా డాన్స్ చేసింది. ఈ పార్టీలో అఖిల్, అల్లు శిరీశ్ లు కూడా హాజరయ్యారు.

అక్కినేని ఇంటి కోడలిగా మారుతున్న ఈ ముద్దుగుమ్మ ఇకపై సినిమాల్లో నటించకపోవచ్చని భావిస్తున్న టాలీవుడ్ వర్గాలు.. ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదనే గుసగుసలు కూడా మొదలయ్యాయి. అయితే తెలుగులో కొత్తగా సినిమాలకు సైన్ చేయని సమంత… కోలీవుడ్‌లో మాత్రం నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఆ మధ్య శివకార్తీకేయన్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన ఈ అందాల భామ… రీసెంట్‌గా విశాల్ నయా మూవీలోనూ హీరోయిన్‌గా నటిస్తోందనే రూమర్స్ జోరందుకున్నాయి. విశాల్ హీరోగా కొత్త దర్శకుడు పీఎస్ మిత్రన్ తెరకెక్కించబోతున్న ‘ఇరుంబు తిరాయ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా సమంత ఫైనల్ అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు.

https://youtu.be/a9SQ4k2s3Ho

- Advertisement -