ఆయన టీమ్ ఆల్‌రౌండర్….

225
virat comment on Chennai team..
- Advertisement -

సూపర్ హిట్‌ ఆట తీరుతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించగల ఆటగాడు. మెరుపు వేగంతో నిర్ధిశిత లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించగల ప్రతిభ అతని సొంతం. అతి తక్కువ సమయంలో టీంమిండియా కెప్టెన్‌గా ఎదిగాడు విరాట్ కొహ్లీ. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా విరాట్(4814) నిలిచాడంటే తన ఆట తీరును మనం అర్ధం చేసుకోవచ్చు.

మొత్తానికి ఈ సీజన్‌లో వరుస వైఫల్యాలతో జోరును కనసాగించలేక పోతున్నాడు. బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌లో స్టార్ ఆటగాళ్లున్నప్పటికి విజయాలకు దగ్గరవ్వడం లేదు. తాజాగా సోమ‌వారం హైద‌రాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బెంగ‌ళూరు ఓట‌మి పాలైన విషయం తెలిసిందే. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ‌ పోరును తలపించిన ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఐదు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచు అనంతరం తన అనుభవాలను పంచుకున్నాడు కోహ్లీ.

virat comment on Chennai team..

త‌మ టీమ్ అన్ని రంగాల్లోనూ విఫ‌ల‌మవుతు వచ్చిందని, ఈ ఐపీఎల్‌లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు బౌలింగ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణిస్తుందన్నారు. అయితే ఈ ఐపీఎల్‌ త‌న దృష్టిలో ధోనీ టీంమైనా చెన్నై సూప‌ర్‌కింగ్స్ జ‌ట్టు ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకుపోతోంద‌ని, ఈ ఐపీఎల్‌లో చెన్నై టీమ్ బెస్ట్ అని కోహ్లీ ఈ విధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక వరుస ఓటములతో వెనక్కి తగ్గుతూ వస్తున్న బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ జట్టుకు దాదాపుగా ప్లే ఆఫ్ ఆశలను చేజారినట్టే. దీంతో బెంగుళూరు అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు.

- Advertisement -