రోహిత్ వద్దు… రాహుల్ బెటర్…

266
- Advertisement -

ఈ సీజన్ ఐపీఎల్‎‎లో కింగ్స్ ఎలెవన్ ఆటగాడు కేఎల్ రాహుల్ మంచి ఫామ్‎‎లో ఉన్నాడు. అయితే రాహుల్‎‎కి రూ.11 కోట్లు పెట్టి కింగ్స్ ఎలెవన్ జట్టు తీసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అతనికి అనవసరంగా రూ.11 కోట్లు పెట్టి తీసుకున్నారని అనుకున్నారు. కానీ రాహుల్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పంజాబ్ జట్టుకు విజయాలు అందిస్తున్నారు. నిన్న రాజస్థాన్-కింగ్స్ ఎలెవన్ మధ్య జరిగిన మ్యాచ్‎‎లో రాహుల్(84) పరుగులు చేసి ఒంట్టి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.

KL Rahul in place of Rohit Sharma as Best Team India Opener

నిన్నటి మ్యాచ్‎‎లో ఐపీఎల్ కెరీర్‎‎లోనే అత్యధిక స్కోరు(84) నమోదు చేశాడు రాహుల్. ఈ సీజన్‎‎లో ఆడిన 9 మ్యాచ్‎‎లలో 47 పరుగుల సగటుతో 376 పరుగులు చేశాడు. మరోవైపు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఈ ఐపీఎల్‎‎లో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. అయితే ఇదే సమయంలో నెటిజన్లు రోహిత్ శర్మపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాలో రోహిత్ శర్మ స్థానంలో రాహుల్‎‎ను ఎందుకు తీసుకోకూడదన్న చర్చని ట్విట్టర్ వేదికగా అభిమానులు లేవనెత్తారు.
63669944

వచ్చే వరల్డ్ కప్‎‎లో ఓపెనర్‎‎గా రోహిత్ స్థానంలో సరైన ఓపెనర్ రాహుల్ అవుతాడంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు ట్విట్టర్‎‎లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరోవైపు సెలక్టర్లు కూడా రోహిత్‎‎ని తీసుకుని మరోసారి తప్పు చేయరాదని సూచిస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్‎‎లో రోహిత్ ఆడతాడా? లేదా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.

- Advertisement -