సెన్సార్ బోర్డుతో ఫైట్‌లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గెలిచాడు. కార్మికుడిగా,కర్షకుడిగా ముఖ్యంగా ఎర్రజెండా సినిమాలు తీయడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నారాయణ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అన్నదాత సుఖీభవ. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. కొన్ని డైలాగ్‌లను తీసేయాలని సెన్సార్ బోర్డు చెప్పడంపై నారాయణ మూర్తి ఫైర్ అయిన సంగతి తెలిసిందే.
తన చిత్రాన్ని రివైజింగ్ కమిటీకి తీసుకువెళ్లారు. తాజాగా రివైజింగ్ కమిటీ ఎర్రన్న వాదనతో ఏకీభవిస్తూ.. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో పీపుల్స్ స్టార్ సినిమా విడుదలకు లైన్ క్లీయరైంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ సినిమాపై ఉన్న తన నమ్మకం గెలిచిందన్నారు. రివైజింగ్ కమిటీ కమిటీ జీరో కట్స్‌తో క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చిందన్నారు. ఈనెల 14న ‘అన్నదాత సుఖీభవ పాటలను విడుదల చేసి.. జూన్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తానన్నారు.తాను 30 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నానని.. అవన్నీ ప్రజల పక్షంగా ఉంటున్నాయే తప్ప ఎవర్నీ కించపరిచేలా తీయలేదన్నారు
సినిమాలో ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు కానీ, రైతు అప్పుకట్టపోతే పీడిస్తారు అనే ప్రధాన డైలాగ్పై సెన్సార్ అభ్యంతరం చేయడంతో ఎర్రన్నకు కోపం వచ్చింది.ఈ సీన్లు తొలగించని కారణంగా తన సినిమాకు సెన్సార్ చేయలేదని అందువల్లే ఖర్చుతో కూడుకున్నదైనా ఆలోచించకుండా రివైజింగ్ కమిటీ వెళ్లానన్నారు.