మహానటి…క్లీన్ యు

271
Mahanati censor.. clean U
- Advertisement -

అలనాటి నటి సావిత్రి….తన నటనతో, అభినయంతో అన్ని భాషల్లో నటించి నట శిఖరంగా ఎదిగింది. అలనాటి ప్రముఖలు హీరోలతో నటించి నటనకు అర్థం చెప్పింది. ఎన్టీఆర్, ఏన్నాఆర్, ఎస్వీఆర్, వంటి నటశిఖరాలతో ఆమె చేసిన పాత్రలు ఈనాటి సినీ ప్రేక్షకుల గుండెళ్లో ఇప్పటికి మెదులుతున్నాయి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నచిత్రం ‘మహానటి’. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్న సినిమా యూనిట్ తాజాగా సెన్సార్ కార్యక్రామలను సైతం పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించడం ఖాయమనే ధీమాలో ఉన్నారు దర్శక,నిర్మాతలు.

ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో మలయాళ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్ ,సావిత్రి పాత్రలో కీర్తీసురేష్ నటించగా సమంతా జర్నలిస్ట్‌గా నటిస్తుంది.విజయ్ దేవరకొండ , మోహన్ బాబు,ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్స్,టీజర్,ట్రైలర్ ,సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో వేడుకకు ఎన్టీఆర్ హాజరుకావడం కూడా కలిసివచ్చే అవకాశం ఉంది.

- Advertisement -