దేశానికి దిక్సూచిగా కొత్త ఫ్రంట్‌..

229
Country needs a change says Akhilesh
- Advertisement -

మెరుగైన పాలనతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందని తెలిపారు యూపీ మాజీ సీఎం అఖిలేష్. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్‌తో మీడియా సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ ప్రజలు మార్పు కొరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన సంక్షేమ ఫలితాలు బాగున్నాయని తెలిపారు. బీజేపీ సర్కార్‌ను ప్రజల ఆకాంక్షలను నేరవేర్చలేదని తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్ని కలిపి బీజేపీని గద్దె దింపుతాయని తెలిపారు. కేసీఆర్ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన దేశం అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. ఏళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు నేరవేర్చలేదన్నారు. రైతు సంతోషంగా లేనంత వరకు దేశం బాగుపడదు. బీజేపీ ప్రజలకిచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. యూపీలోని సీఎం,డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లో బీజేపీని ఓడగట్టి మార్పుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.తాగునీటి సమస్య కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. కేసీఆర్‌ తీసుకుంటున్న చొరవ మంచి ప్రయత్నమని … దేశానికి దిక్సూచిగా కొత్త ఫ్రంట్‌గా ఉండబోతుందన్నారు. దేశంలో మంచి వాతావరణం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మా మద్దతు ఎప్పుడూ కొనసాగుతోందన్నారు.

- Advertisement -