వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం నా పేను సూర్య. మే 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి స్పెషల్ షోలు ఉంటాయా…? ఉండవా…? అనే సందేహం బన్నీ అభిమానులలో నెలకొంది. అయితే తాజాగా ఆ సందేహానికి తెరపడింది. ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ ఈ చిత్రానికి స్పెషల్ షోలకి అనుమతి లభించింది.
ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలను స్పెషల్ షోలు వేసి భారీ మొత్తంలో వసూళ్లు రాబడుతున్నారు నిర్మాతలు. ఈ కోవలోనే రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు స్పెషల్ షోలతో భారీ మొత్తంలోనే వసూళ్లు రాబట్టాయి. ప్రస్తుతం నా పేరు సూర్య మూవీ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉదయం 5 గంటల నుంచి 10 గంటలోపు అదనంగా ఒక షోను ప్రదర్శించనున్నారు.
దేశ భక్తి నేపథ్యంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ పాటలు, ట్రైలర్‌తో బన్నీ అదరగొట్టేశాడు. వరుసగా రెండు సినిమాలతో బన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాడు. మరోసారి అదే తరహాలో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి మరో హిట్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి మరి.