కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ కథానాయికుడిగా తెరకెక్కుతున్న చిత్రం నేల టిక్కెట్టు. ఇప్పటికే టీజర్ తో సినిమాపై అంచనాలను పెంచేశాడు దర్శకుడు. చుట్టూ జనం.. మధ్యలో మనం అలా ఉండాలిరా లైఫ్ అంటే, నేల టిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు వంటి డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్ మహారాజ నుంచి మరో కామెడీ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచికుని ఈ చిత్రాన్ని తెరకెక్కుస్తున్నారు. ఈనెల 12న ఈ మూవీ ఆడియో వేడుకని నిర్వహించాలని చిత్ర యూనిట్ భాస్తోంది. ఈ ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా పవన్ స్టార్ పవన్ కల్యాణ్ రానున్నట్లు సమాచారం. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
రవితేజకి మెగా ఫ్యామిలీకి ఉన్న సాన్నిహిత్యం దృష్ట్య పవన్ ని పిలుచారని, పవన్ తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తాడని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ రాకతో ఈ సినిమాపై ఫోకస్ మరింత పెరుగుతుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. పవన్ వస్తే రవితేజ మార్కెట్ పెరిగే అవకాశాలు లేక పోలేవు. అన్నయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా నటించారు రవితేజ అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి రవితేజకి మంచి సానిహిత్యం ఏర్పడింది.
సొగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత 3వ చిత్రంతో నేల టిక్కెట్టు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కల్యాణ్ కృష్ణ. మరీ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో మాస్ ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి మరి.ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా, జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశికాంత్ కార్తీక్ మ్యూజిక్ డైరెక్టర్.