హ్యాపీ బర్త్ డే మై లవ్ -కోహ్లీ

227
Happy birthday, my love: Virat Kohli
- Advertisement -

బాలీవుడు నటి, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు నేటితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భార్య అనుష్క శర్మతో కేక్ కట్ చేయించాడు కోహ్లీ. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. హ్యాపీ బర్త్ డే మై లవ్. నాకు తెలిసిన వాళ్లలో అందరి కంటే ఎక్కువగా పాజిటివ్‎గా, నిజాయతీగా ఉండే వ్యక్తివి నీవే. లవ్ యూ అంటూ శుభాకాంక్షలు తెలియజేశాడు.

Happy birthday, my love: Virat Kohli

పెళ్లైన తర్వాత అనుష్క శర్మ జరుపుకుంటున్న మొదటి బర్త్ డే ఇది. ఇక అనుష్క శర్మకి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోహ్లీ పోస్ట్ చేసిన బర్త్ డే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. మరోవైపు ఐపీఎల్‎లో కోహ్లీ ఆర్పీబికి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ జట్టు పరాజయాల బాట పట్టింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతుంది.

- Advertisement -