ఐపీఎల్ సీజన్ 2018లో వరుస విజయాలతో జోరును కొనసాగిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. . ఆడిన ప్రతి మ్యాచులో ఒకరు ప్రతిభను చూపుతూ జట్టును విజయతీరాలకు తీసుకెళుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఐపీఎల్‌కు దూరమైన చెన్నై ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటుంది. ఇటీవల ఈ జట్టులో దక్షిణాఫ్రికా ఆటగాడైన లుంగి ఎంగిడి తన తండ్రి మరణంతో దక్షణాఫ్రికా బయదలుదేరాడు. ఇక లుంగి ఎంగిడి రాలేడన్న వార్తలు కూడా వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం తిరిగి లుంగి ఎంగిడి జట్టులోకి చేరినట్లు తెలుస్తోంది. అతను భరత్ చేరుకుని పుణేలో జరుగుతున్న మ్యాచుకు ప్రాక్టీసు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.టోర్నీలో భాగంగా నేడు ముంబయి ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో లుంగి ఎంగిడి చేరికతో జట్టుకు కాస్త బలం చేకూరినట్టైందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చెన్నై ఆడిన ఆరు మ్యాచులో ఐదు గెలిచి తన సత్తాను చాటుకుటుంది. ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయి పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకింది. గతంలో ముంబయి ఇండియన్స్ చైన్నైతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులోనైన గెలుస్తుందో లేదో చూడాలి మరి..!