జనసేన అధినేత,సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ట్విట్టర్ ద్వారా తమ ఛానల్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులను ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు పవన్‌పై ఐపీసీ 469,504,506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
శ్రీరెడ్డి తనను అసభ్య పదజాలంతో దూషించిందని మండిపడ్డ పవన్..మీడియా పదే పదే ఆ వ్యాఖ్యలను చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేగాదు తనను కొంతకాలంగా టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా పవన్ మండిపడుతున్నారు. అంతేగాదు సదరు ఛానళ్లపై న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటించారు.
టీవీ 9, ఏబీఎన్, టీవీ 5 ఛానల్స్‌ను నిషేదించాలని కోరుతూ పిలుపును కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పవన్ తీరుపై అభ్యంతరం తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేయడం తగదంటూ నిరసన ప్రదర్శనకు సైతం దిగాయి. ఈ నేపథ్యంలో పవన్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.