సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఇప్పటికే రంగస్థలం రూ.180 కోట్లు వసూల్లు చేసి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు స్పష్టించింది. అయితే ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ గుర్తుంది కదా. ఈ సినిమాలో అనుసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్ తో అందరిని ఫిదా చేసింది. రంగమ్మత్తగా సహజ నటనతో అదరగొట్టింది.
ఒకవైపు బుల్లితెరపై యాంకర్ గా అలరిస్తునే అనుసూయ సినిమాలతో బిజీగా ఉంటుంది. క్షణం మూవీతో వెండితెరికి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ‘సొగ్గాడే చిన్నినాయనా’ నాగార్జునతో నటించి అందరిని అలరించింది. సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంలో ఐటెం సాంగ్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
గ్లామర్ పాత్రలతో అందరిని ఆకట్టుకున్న అనసూయ తొలిసారిగా పల్లెటూరి మహిళగా రంగస్థలం చిత్రంలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నారు. అయితే రంగమ్మత్త పాత్రకోసం అనసూయను ఆడిషన్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రంగమత్త, చిట్టిబాబు మధ్య జరిగే సీన్ ని అనసూయతో చేయించారు. చిట్టిబాబు కొత్త సిల్క్ బట్టలు ధరించి వస్తే, కొంపదీసి పెళ్లి కుదిరిందా? అని అడగటం, ఆపై ఇంతకీ పిల్లెలా ఉంది? ఈ పాటికి మీ
మామయ్య ఉంటేనా తెగ సంతోషపడి పోయుండేవాడు… అయినా నేను లేనా ఏంటి? వంటి డైలాగులో అందరినీ మెప్పించింది. ఈ వీడియో మీరు చూడాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం ఒక లుక్కెయ్యండి.
https://www.youtube.com/watch?v=9knAYg3VIN4