భరత్‌కు పెరిగిన భారీ డిమాండ్‌..

254
- Advertisement -

భరత్‌ రీమేక్‌కు భారీ డిమాండ్‌..

మహేష్ హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ ఈనెల 20న థియేటర్లకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ వచ్చింది. భరత్ అనే నేను విజయం చాలా గొప్పగా అనిపిస్తోందని… ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు డైరెక్టర్ కొరటాల శివతో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తానని సినిమా సక్సెస్ మీట్ లో మహేష్ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ హీరోయిన్ కియారా అద్వాణీ టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ అవుతుందని కాంప్లిమెంట్ ఇచ్చాడు.

Remake of Bharat Ane Nenu in Tamil!

ఇక కలెక్షన్ల పరంగా దూసుకెళుతున్న ఈ మూవీ రీమేక్ హక్కుల కోసం డిమాండ్ బాగా పెరిగింది. హామీ ఇస్తే నిలబెట్టుకోవాలన్న కథాంశంతో పాటు, సీఎం పాత్ర, రాజకీయ నేపథ్యం తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళనాడు రాజధాని చెన్నైలో సైతం తమిళ తంబీలకు బాగా నచ్చిన నేపథ్యంలో, ఈ మూవీని రీమేక్ చేయాలని పలువురు భావిస్తున్నట్టు సమాచారం.

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రాన్ని చూడాలని భావిస్తున్నట్టు తెలుస్తుండగా, స్టార్ హీరో విజయ్ కూడా ‘భరత్ అనే నేను’పై ఆసక్తితో ఉన్నట్టు సమాచారం. ఇక ఓ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ చిత్రం హక్కులను ఫ్యాన్సీ రేటుకి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -