ఐపీఎల్-11 హోరా హోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. పంజాబ్ విజయాల పరంపర కొనసాగిస్తుండడంతో ఆ జట్టు సహ యజమాని ప్రితీ జింతా సంతోషంలో మునిగితేలుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో పంజాబ్ జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ప్రీతి జింతా పంజాబ్ జట్టు ఆటగాడు కేఎల్ రాహుల్‌తో మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఈ ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజేతగా నిలిస్తే ఏం చేస్తారు అని అడగగా.. జట్టు కోసం ప్రత్యేకంగా ఏదో ఒకటి చేస్తా. అదేంటో ఇప్పుడు మాత్రం చెప్పను అని చెప్పేసింది. ఇలాగే ప్రతి మ్యాచ్‌లో విజయభేరి మోగించాలని కోరుకుంటునన్నారు. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
ఇక ఐపీఎల్ వేలంలో ఎవరూ తీసుకోని క్రిస్‌గేల్ ని పంజాబ్ జట్టు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ జట్టు విజయాల్లో కీలక ఆటగాడిగా మారాడు గేల్. సిక్సర్లతో, బోండరీలతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు గేల్. మరోవైజు కేఎల్ రాహుల్ కూడా తన దైన శైలిలో జట్టు గెలుపుకి కృషి చేస్తున్నాడు.