పవన్‌పై నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల వ్యవహారం కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఆర్జీవీ చేయమంటేనే తాను ఇలా చేశానని శ్రీరెడ్డి చెప్పడం…వర్మ సైతం తప్పు తనదేనని వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర స్దాయిలో మండిపడగా తాజాగా పవన్ సైతం ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. తన తల్లిని నడిరోడ్డు మీదకు లాగారని బాధపడ్డ పవన్…రేటింగ్‌ల కోసం ఏమైనా చేస్తారా అని మీడియాని ఏకిపారేశారు.
ఈ నేపథ్యంలో పవన్‌కు పలువురు సినీనటులు మద్దతు ప్రకటించారు. వర్మ ప్రియ శిష్యుడు పూరి జగన్నాథ్ సైతం పవన్‌కే తన సపోర్టు అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నాకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు బాధపడటం నాకు చాలా బాధ కలిగించింది . అతనిని ఎప్పుడూ ఇలా చూడలేదు . ఆర్జీవీ చేసిన పని నాకు నచ్చలేదు ప్రాణం ఉన్నంత వరకూ ఐ సపోర్ట్ పవన్ కల్యాణ్’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు ఫిలించాంబర్‌లో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు మెగా హీరోలు. నాగబాబుతో కలిసి ఫిలిం చాంబర్‌కు పవన్ చేరుకోగా తర్వాత రామ్ చరణ్,అల్లు అర్జున్,సాయి ధరమ్ తేజ్‌తో పాటు మా అసోసియేషన్ సభ్యులు చేరుకున్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలపై వీరంత నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలుస్తోంది.