బీట్ పే బూటీ ఛాలెంజ్ ఇంటర్నెట్లో ఎంత హల్ చల్ చేస్తుందో తెలిసిందే. ఫ్లైయింగ్ జాట్ సినిమా ప్రమోషన్లో భాగంగా పలువురు సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఈ బీట్ పే బూటీ ఛాలెంజ్‌లో పాల్గోంటున్నారు. ఇప్పటివరకు సోనాక్షి సిన్హా, సన్నీ లియోన్, వరుణ్ ధావన్, హూమా ఖూరేషీ, క్రితీ సనన్ ఇంకా చాలా మందే ఈ ఛాలెంజ్‌లో పాల్గోన్నారు. ఇపుడు తాజాగా ఈ లిస్ట్‌లో ప్రముఖ రచయిత చేతన భగత్ కూడా చేరిపోయాడు.
ది త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, టూ స్టేట్స్, వాట్ యంగ్ ఇండియా వాంట్స్, ఫైవ్ పాయింట్ సమ్‌వన్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి పుస్తకాలతో యువతను ఎక్కువగా ఆకట్టుకున్న చేతన్ భగత్.. తన డాన్సులతో కూడా సోషల్ మీడియాను ఆకట్టుకుంటున్నాడు. బీట్ పే బూటీ పాటకి చేతన్ శ్రద్దకపూర్, అర్జున్ కపూర్లతో కలిసి డాన్స్ చేశాడు. మొదటగా చేతన్ నాచ్ బలీయే అనే డ్యాన్స్ షోకి జడ్జీగా వ్యవహరించాడు. ఆయన డాన్స్ స్కిల్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది.
ఇక చేతన్ తన తాజా బుక్‌తో మరోసారి పాఠకుల ఆదరణను చూరగొంటున్నారు. ‘వన్ ఇండియన్ గర్ల్’ పేరుతో విడుదలైన ఈ బుక్ అమెజాన్ ప్రీ-ఆర్డర్ చరిత్రలో రికార్డులు బద్దలు కొడుతోంది. అమెజాన్, రూపా పబ్లిసింగ్ భాగస్వామ్యంతో ఎక్స్‌క్లూజివ్‌గా ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన రెండు గంటల్లేనే అత్యధిక ప్రీ ఆర్డర్లు నమోదుచేస్తున్నాయి.