టాక్సీవాలా…గేర్ మార్చాడు

232
Taxiwaala Movie Teaser
- Advertisement -

పెళ్లి చూపులు చిత్రంతో నటుడిగా, అర్జున్ రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న హీరోగా పేరు తెచ్చుకొని, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్‌గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది. జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్ర టీజర్‌ని ఏప్రిల్ 18న విడుదల చేసింది చిత్రయూనిట్. టీజర్‌కు మంచిస్పందన వచ్చింది.

టీజర్‌ను చూస్తే.. ‘టాక్సీవాలా’ కథ ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ జానర్ మూవీ అని తెలుస్తోంది. కథకు తగ్గట్టే టీజర్‌ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విజయ్ దేవరకొండ కెరియర్‌లో తొలిసారిగా ఓ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌‌ మూవీ చేయబోతున్నారు. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్.. ‘టాక్సీవాలా’ టాప్ గేర్‌లో దూసుకుపోవడం ఖాయం గానే కనిపిస్తుంది. ఇప్పటివరకు 10 లక్షల మంది ఈ టీజర్‌ని చూశారు. ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -