ఆఫీస్‌ టైంలో కజ్‌రారే..కజ్‌రారే… ప్రభుత్వ ఉద్యోగుల చిందులు

265
Govt officials in MP's Dewas caught dancing inside office
- Advertisement -

వీళ్లు ప్రభుత్వ ఉద్యోగులు…మహిళా శిశు సంక్షేమం కోసం పాటు పడే అధికారులు. కానీ ఆఫీస్ టైంలో పని మానేసి ఎంచక్క ఎంజాయ్ చేశారు. అధి నాగిని,ఖజ్ రారే పాటలకు డ్యాన్స్ వేస్తూ తాము అధికారులమనే సంగతి మర్చిపోయేలా. మధ్య ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దేవాస్‌ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ డ్యాన్స్ ప్రొగ్రాంతో ఉన్నతధికారులు సీరియస్ అయ్యారు. సహ ఉద్యోగి బర్త్ డే సందర్భంగా మహిళా ఉద్యోగితో ఓ ఉన్నతాధికారి కూడా డ్యాన్స్ చేయడంపై నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇది సర్కార్‌ ఆఫీసుల్లో ఉద్యోగుల తీరు అంటూ కొంతమంది కామెంట్ చేస్తుండగా మరికొంతమంది వీళ్లు ఆఫీసులో ఎంతలా కష్టపడుతున్నారో చూసిన వాళ్లకు ఇట్టే అర్థమయిపోతుందని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

https://youtu.be/JUOE5HcD82o

- Advertisement -