భరత్‌ నుండి ‘వచ్చాడయ్యో సామి’..

384
Vachaadayyo Saami Video Song Promo
- Advertisement -

ప్రిన్స్‌ మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కైరా అడ్వాణీ కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం సెన్సార్‌ పూర్తి కాగా, యూ/ఏ ఇచ్చారు. మరో పక్క చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ‘వచ్చాడయ్యో సామి’ అనే సాంగ్ ప్రోమోను వదిలారు. మహేశ్ తన ట్విట్టర్ వేదికగా ఈ సాంగ్ ప్రోమోను వదలడం విశేషం.

Vachaadayyo Saami Video Song Promo

లుంగీ పైకి కట్టి .. తలకి పాగా చుట్టుకుని .. నాగలిని భుజాన పెట్టుకుని ఓ రైతులా మహేశ్ బాబు కనిపిస్తూ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ లో ఈ సాంగ్ కి ఎక్కువ మార్కులు పడటం విశేషం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం .. దేవిశ్రీ సంగీతం ఈ పాటని జనం నాల్కలపై నిలబెట్టాయనే చెప్పాలి.

సినిమా రిలీజ్ కి ముందు ఈ సూపర్ హిట్ సాంగ్ ప్రోమోను వదలడం మరింతగా కలిసొచ్చే అంశం. మహేష్‌బాబు ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో మహేష్‌ ఎలాంటి హిట్‌ అందుకుంటాడో చూడాలి.

- Advertisement -