చెర్రీ నెక్ష్ట్ మూవీ టైటీల్ ఇదేనట ?

269
Ram Charan – Boyapati’s film Title?
- Advertisement -

రాంచరణ్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఈ మధ్యే రిలీజై కలెక్షన్లతో దూసుకుపోతూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ సినిమా విజయాన్ని అస్వాదిస్తూనే మరో సినిమా పనుల్లో బిజీగా మారాడు చరణ్‌. అయితే రాంచరణ్‌ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

 Ram Charan – Boyapati’s film Title?

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు మాస్ ఎలిమెంట్లతో కూడిన ‘రాజవంశస్థుడు’ అనే టైటిల్ ను లీక్ చేశారట చిత్ర యూనిట్. అయితే టైటిల్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే పరిశీలనలో మాత్రం ఉందట. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా అద్వాణి నటించనుందని సమాచారం. చరణ్‌ త్వరలో ఈ చిత్ర షూటింగ్ లో పాల్లోననున్నాడు. ఈ సినిమాకు కూడా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది.

- Advertisement -