కతువా రేప్ కేసులో మరో మలుపు..

274
Accused seek narco test as Kathua rape-and-murder trial begins
- Advertisement -

దేశవ్యాప్తంగా ఆవేదనను రగిల్చిన కఠువా అత్యాచార ఉదంతంపై సోమవారం స్థానిక జిల్లా సెషన్స్‌ కోర్టులో విచారణ ప్రారంభమయ్యింది. ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది నిందితులూ తాము తప్ప చేయలేదని పోలీసుల విచారణలో స్పష్టంగా చెబుతున్నారని సమాచారం. కావాలంటే తమకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని వారు డిమాండ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ కేసు విచారణ ప్రారంభమైన నేపథ్యంలో నిందుతులు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎనిమిది మంది నిందితుల్లో పోలీసు అధికారులతో పాటు ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడన్న సంగతి తెలిసిందే.

Accused seek narco test as Kathua rape-and-murder trial begins

వీరందరినీ న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసివున్న కోర్టు హాలులో ప్రవేశపెట్టిన వేళ, సెషన్స్ జడ్జి సంజయ్ గుప్త, వారందరికీ చార్జ్ షీట్ కాపీలను అందించాలని ఆదేశించారు. ఇదే సమయంలో తమకు బెయిల్ మంజూరు చేయాలని నిందితులు పెట్టుకున్న పిటిషన్ పై 26న విచారిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్ అధికారి సంజీ రామ్, తమకు నార్కో టెస్ట్ చేయాలని న్యాయమూర్తికి విన్నవించారు. తనను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొట్టి నేరాన్ని ఒప్పించారని ఆరోపించారు. తామందరమూ ఈ పరీక్షకు సిద్ధమని తెలిపారు. కాగా, కోర్టు నార్కో టెస్టులపై నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.

- Advertisement -