‘భరత్‘ సెన్సార్ పూర్తి… జీరో కట్స్..

262
Bharat Ane Nenu gets censor certificate without cuts
- Advertisement -

సెన్సార్ పూర్తి చేసుకున్న భరత్ అనే నేను చిత్రం. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసింతే. ఈ చిత్రం ఈనెల 20న భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. అయితే ఎటువంటి కట్టింగ్స్ లేకుండా జీరో కట్స్ తో సెన్సార్ పూర్తి కావడం విశేషం.

Bharat Ane Nenu gets censor certificate without cuts

ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకులలో హైప్ క్రియేట్ చేసి ఆసక్తిని నెలకొల్పింది. మరోవైపు భరత్ కోసం మహేష్ అభిమానులు వేచిచూస్తున్నారట. కొరటాల దర్శకత్వంలో ప్రతి సినిమా విజయం సాధించాయి. అయితే శ్రీమంతుడితో హిట్ ఇచ్చిన కొరటాల భరత్ అనే నేను సినిమాతో మహేష్ కి మరో హిట్ ఇవ్వనున్నారని ఫిలింనగర్ టాక్.

శ్రీమంతుడి తరువాత సరైన హిట్ లేని మహేష్ కి ఈ సినిమా ఖచ్చింత విజయం సాధించాల్సిన అవసరం ఉంది. మహేష్ కూడా ఈ మూవీపై చాలానే ఆశలు పెట్టుకున్నాడట. చూడాలి మరి మహేష్ కి కొరటాల మరో హిట్ ఇస్తాడో లేదో.?

- Advertisement -