టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన శ్రీరెడ్డి వివాదంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పీఎస్ లేదా కోర్టులను సంప్రదించాలని, టీవీల్లో కూర్చొవడం వల్ల సమాజానికి మెసేజ్ వెళుతుంది కానీ ఉపయోగం ఉండదని తెలిపారు. తాను మద్దతిచ్చినా లీగల్ గా వెళ్లకపోతే ఏమీ జరగదని పవన్ తెలిపారు. సెన్సేషనలిజం కోసం పాకులాడటం సరికాదని మీడియాలో ఎంత మాట్లాడిన మేసేజ్ పట్టుకెళ్ల గలం కానీ న్యాయం జరగదన్నారు. చట్టాల ద్వారానే ఎవరికైనా న్యాయం జరుగుతుందని చెప్పారు.
ఇక కథువాలో ఎనిమిదేళ్ల బాలకిపై జరిగిన సామూహిక అత్యాచారాం తనను ఎంతగానో కలచివేసిందని తెలిపారు.ఆడపిల్లల్ని వేధించేవారిని, అత్యాచారానికి ఒడిగట్టేవారిని బహిరంగంగా శిక్షించాలని… అప్పుడే అందర్లో భయం పుడుతుందని అన్నారు. మన దేశంలో కథువా ఘటనే మొదటిది కాదు …చివరిది కాదని తెలిపారు.
ఆడపిల్లలు బయటకు వెళ్తే వారిని వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా తనకు తెలుసని పవన్ చెప్పారు. ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు 200 మంది యూనిట్ సభ్యులం ఉన్నామని… అయినా బయటివారు వచ్చి, సినిమాకి సంబంధించిన అమ్మాయిలను వేధించారని… అప్పుడు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందని తెలిపారు. కళ్ల ముందు జరిగితే కానీ ఎంపీలు స్పందించరా అని అసహనం వ్యక్తం చేశారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.