జక్కన్న మల్టీస్టారర్‌లో నాని..!

274
Chit Chat With Natural Star Nani
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా ఇటీవలె RRR(రామ్‌ చరణ్‌,రాజమౌళి,రామారావు)పేరుతో రాజమౌళి విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఈ సినిమా అనౌన్స్‌ అయిన దగ్గరి నుంచి ఏ చిన్న వార్తైన టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో రాజశేఖర్‌ని తీసుకుంటున్నారని ప్రచారం జరగగా ఈ వార్తలను జీవిత రాజశేఖర్ ఖండించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారని వార్త హల్ చల్ చేస్తోంది.

Chit Chat With Natural Star Nani

అయితే దీనిపై క్లారిటీ ఇచ్చాడు నాని. జక్కన్న మల్టీస్టారర్‌లో తాను నటించడం లేదని ఇది పూర్తిగా చరణ్‌-ఎన్టీఆర్ సినిమానే అన్నారు. ప్రస్తుతం తాను కృష్ణార్జున యుద్ధం సినిమాతో బిజీగా ఉన్నానని తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకురానుంది. కృష్ణ,అర్జున్ అనే రెండు పాత్రలో నాని కనిపిస్తుండగా అనుపమ పరమేశ్వరన్,రుక్సార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాని మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అమెరికాలో రికార్డు స్థాయిలో అత్యధిక స్క్రీన్లపై సినిమాను విడుదల చేయనున్నారు. నాని సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు లేని విధంగా మొత్తం 600 స్క్రీన్లపై అక్కడ సినిమాను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -