బాలీవుడు సూపర్ స్టార్ అమిర్ ఖాన్ మహాభారతం చిత్రాన్ని నిర్మిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత్తం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పురాణాలు, చరిత్రకి సంబంధించి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మాతలు తెరికెక్కిస్తున్నారు. చారిత్రాత్మక చిత్రాలపై హీరోలు సైతం నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడు హీరో అమిర్ ఖాన్ మహాభారతం సినిమాను 5 భాగాలను అందించాలనుకుంటున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.
కానీ తాజాగా ఆయన ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. ఈ మధ్య ఇలాంటి చిత్రాలు వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో తాను అలాంటి చిత్రాల జోలికి వెళ్లి అనవసరమైన వివాదాలను ఇరుక్కొవడం ఎందుకనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పద్మావత్ చిత్రం కర్ణిసేన ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. కానీ మహాభారతంలో కృష్ణుడు, కర్ణుడు పాత్రల పట్ల అమిర్ ఆసక్తిగా ఉన్నారట.