టీ యాప్‌తో..150 రకాల ‘మీసేవ’లు..

339
T App Folio
- Advertisement -

ఈ-సేవ, మీ-సేవలకు కాలం చెల్లింనట్లే..ఇక ఇంట్లో ఉండే సర్కార్ సేవలు చేసుకోవచ్చు.. టీ-యాప్ ఫోలియో పేరుతో ఓ మొబైల్ యాప్ తీసుకు వస్తోంది తెలంగాణ ప్రభుత్వం..ఐటీ శాఖతో పాటు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థలు సంయుక్తంగా ఈ యాప్ ను అభివృద్ధి చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నో వినూత్న కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతుంది. అందులో భాగంగా అన్ని అరచేతిలో ఉన్న చోట నుంచే సేవలను సద్వినియోగం చేసుకొనేందుకు టీ యాప్ ఫోలియోను రూపొందించింది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వ సేవలను సత్వరమే అందించేందుకు ఇప్పటికే టీ ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక మీ సేవా కేంద్రాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునే పని లేకుండా ఇంట్లోనే ఫోన్ ద్వారా చేసుకొనే సౌకర్యాన్ని టీ యాప్ ఫోలియో కల్పిస్తుంది. జిల్లా స్థాయిలో దీనికి కావాల్సిన ఏర్పాట్లను అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

T App Folio

వాస్తవానికి కుల, ఆదాయం వంటి ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలు అక్కడే అందుబాటులో ఉన్నాయి. తాజాగా టీ యాప్ ఫోలియో విధానంలో మీ సేవ సర్వీసులన్నీ ఓపెన్ ఆన్‌లైన్‌లోకి వస్తాయి. అంటే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్లకుండానే ఎక్కడినుంచైనా, ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

దీని ద్వారా మొదట 150 రకాల సేవలను ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానంలో సెల్, ఆధార్ నంబర్‌తో యాప్‌లో ముందుగా అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం అయిన వారు మాత్రమే సంబంధిత ధ్రువీకరణ పత్రాలను యాప్‌తో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వీలు కలుగుతుంది.

- Advertisement -