- Advertisement -
సంచలన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరో మైరా సరీన్ హీరోయిన్ గా తెరక్కిస్తున్న చిత్రం ”ఆఫీసర్” ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఈ రోజు రిలీజ్ చేశారు. ఆఫీసర్ కోసం వర్మతో పనిచేసే ప్రతి క్షణాన్ని అస్వాదిస్తానని నాగార్జున ట్విట్ చేశారు.
మొదలు పెట్టిన దానిని పూర్తి చేయడం నా బాధ్యత అంటూ నాగ్ చెప్పే డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. గతంలో వర్మ, నాగార్జున కాంబినేషన్ లో వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం ‘శివ’. మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న ఆఫీసర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మే 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సన్నివేశాలు సినిమాను ఓ స్థాయిలో నిలబెడుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
- Advertisement -