తెలుగు చిత్రపరిశ్రమలోకి కొత్తతరం నటీనటులు, దర్శకులు రావాలని వచ్చినప్పుడే సృజనాత్మకతో కూడిన కొత్త కొత్తదనం సినిమాలు పుట్టకొస్తాయని ప్రముఖ సినీ దర్శకుడు తేజ తెలిపారు. రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో వర్సిటీలో ఫిలిం డైరెక్షన్ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు రూపొందించి లఘుచిత్రోత్సవాన్ని నిన్న (ఆదివారం) నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు తేజ పాల్గొని మాట్లాడుతూ సినీ పరిశ్రమలో్కి వచ్చే ప్రతిఒక్కరు సినిమాల పట్ల కనీస అవగాహాన లేకుండా చిత్రపరిశ్రమలోకి అడుగుపెడితే ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతాయన్నారు. కాకపోతే ఎక్కువ మంది చూసి నేర్చుకోవాలనే ప్రయత్నంలో విఫలమువుతూ నష్టపోతున్నారని, చూసి నేర్చుకోవటం కన్నా చదివి నేర్చుకుంటే సృజనాత్మకతో కొత్తదనాన్ని ఆవీష్కరించవచ్చని ఆయన తెలిపారు.
నేను తీసే ప్రతీ చిత్రంలో కొత్త తరం నటీనటులకు అవకాశమిస్తున్నామన్నారు. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షపన్యాసం అనంతరం సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గొప్ప గొప్ప చదువులు చదివి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం నాకు గర్వంగా ఉందని గోపాలకృష్ణ తెలిపారు. ప్రతిష్ఠాత్మకమైన పూణే ఫిలిం ఇనిస్టిస్ట్యూట్ లో దర్వత్వం, నటన వంటి డిప్లొమా కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, తెలుగు యూనివర్సిటీలో మాత్రం పీజీ డిప్లొమా కోర్సు మనకు అందుబాటులో ఉండటం గొప్ప విషయమన్నారు.