మర్కూక్‌కు డబుల్ ధమాకా..

212
- Advertisement -

సిద్దిపేట జిల్లాలో కొత్త మండలం మార్కూక్‌ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. మార్కూక్‌లోని తహశీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు.ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మర్కూక్ ప్రజలకు దసరా, కొత్త మండలం ఏర్పడినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ మర్కూక్ ప్రజలకు డబుల్ ధమాకా అన్నారు. అటు దసరా పండుగ, ఇటు కొత్త మండలం ఏర్పాటు చేసుకున్న పండుగ జరుపుకుంటున్నారని తెలిపారు.

దైవజ్ఞ శర్మ మర్కూక్‌ను మండలం చేయమన్నాడని సీఎం చెప్పారు. అయితే మార్కూర్‌తో పాటు ఇప్పుడు ఎర్రవెల్లిని కూడా మండలం చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చమత్కరించరించడంతో సభలో నవ్వులు విరబూసాయి. శర్మ కోరినట్టు తన మండలం మర్కూక్‌ను ఉత్తమ మండలం చేస్తానని సీఎం అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఎర్రవెల్లి, నర్సన్నపేటలు కావాలని ఆకాంక్షించారు. ఎర్రవెల్లి, నర్సన్న పేట గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దేది ఆదర్శ గ్రామాలుగా తీసుకోవాలని తెలిపారు. ఎర్రవెల్లి, నర్సన్నపేటలా మర్కూక్ బంగారు మండలం కావాలన్నారు. ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ప్రజల్లాగా మీలో స్ఫూర్తి రావాలన్నారు. మర్కూక్ తన సొంత మండలమని అది అభివృద్ధి చెందితే తనకే గర్వ కారణమని తెలిపారు. మర్కూక్ మండలం అభివృద్దికి వెంటనే రూ.10 కోట్లు విడుదల చేస్తున్నానని ప్రకటించారు. ఈ నిధులను మండలం అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు.

మొండిగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. ఇవాళ తెలంగాణ రాకుంటే మర్కూకు వచ్చేది కాదని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది జరుగుతుందని తెలిపారు. మనం పట్టుబడితే సాధించనిదేమీలేదని చెప్పారు.

- Advertisement -