తెలంగాణలో 31 జిల్లాలు ప్రారంభం

227
- Advertisement -

29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధే లక్ష్యంగా 21 నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. దసరా పర్వదినాన సిద్దిపేట నుంచి కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ప్రారంభించారు. సిరిసిల్ల(రాజన్న) జిల్లాను ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కేటీఆర్ సమక్షంలో కృష్ణ భాస్కర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జయశంకర్ జిల్లాలో స్పీకర్ మధుసుధనాచారీ ఆచార్య జయశంకర్ సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలాగే ఇతర జిల్లాల్లో మంత్రులు, అధికారులు కొత్త జిల్లాలను ప్రారంభించారు. వారి వివరాలు..

మెదక్ – డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి
మంచిర్యాల – పద్మారావు
వికారాబాద్ – మహేందర్‌ రెడ్డి
సూర్యాపేట – జగదీష్‌ రెడ్డి
కొత్తగూడెం – తుమ్మల నాగేశ్వరరావు
నిర్మల్ – ఇంద్రకరణ్‌ రెడ్డి
సిరిసిల్ల (రాజన్న) – కేటీఆర్
ఆసిఫాబాద్ – జోగు రామన్న
జనగామ – మండలి ఛైర్మన్ స్వామిగౌడ్
వరంగల్ (రూరల్)- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
యాదాద్రి – నాయిని నర్సింహారెడ్డి
పెద్దపల్లి – ఈటల రాజేందర్
కామారెడ్డి – పోచారం శ్రీనివాస్ రెడ్డి
జోగులాంబ – లక్ష్మారెడ్డి
మేడ్చల్ (మల్కాజిగిరి) – తలసాని శ్రీనివాస్ యాదవ్
జగిత్యాల – డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ
వనపర్తి – ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
నాగర్ కర్నూలు – జూపల్లి కృష్ణారావు
మహబూబాబాద్ – చందూలాల్

- Advertisement -