కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా పడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో బెయిల్ పై వాదనలు విన్న న్యాయస్ధానం ఇవాళ నిర్ణయం వెలువరించనుండగా భారీ షాక్ తగిలింది. సల్మాన్‌కు బెయిల్ వస్తుందా రాదా అనేదానిపై సంగ్దిగ్ధం నెలకొంది. శనివారం పిటిషన్ విచారణకు రావాల్సి ఉండగా.. రాజస్థాన్ హైకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. జోధ్‌పూర్ జిల్లా మరియు సెషన్స్ జడ్జిని బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటున్న సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ జోషితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 87 మంది జడ్జిలను ట్రాన్స్ఫర్ చేస్తూ హైకోర్టు శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సల్మాన్ బెయిల్ పిటిషన్ వాయిదా పడినట్లేనని.. ఆయన మరిన్ని రోజులు జైల్లోనే గడపాల్సి ఉంటుందని న్యాయ నిపుణలు చెబుతున్నారు.
విచారణలో ఎన్నో లోపాలున్నాయని, ఈ కేసులో సల్మాన్ ఆయుధాలు ఉపయోగించినట్లు ఎక్కడా రుజువు కాలేదని వాదించారు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వాదించారు సల్మాన్ న్యాయవాదులు.
ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను విశ్వసించలేమని చెబుతూ, వేటకు సంబంధించిన మిగతా కేసుల్లో సల్మాన్ పై అభియోగాలేవీ రుజువు కాలేదని న్యాయస్థానానికి గుర్తుచేశారు. ఇంతలోనే జడ్జిల బదిలీ నిర్ణయంతో సల్మాన్ మరిన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.