- Advertisement -
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ విమానాశ్రయంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. లగేజీ ప్రాంతంలో బ్యాగ్ పై బాంబ్ అని రాయడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. కొద్దిసేపు విమానాశ్రయాన్ని మూసేసి, ప్రయాణికులను మరో ప్రాంతానికి తరలించారు. ఆ బ్యాగ్ భారత్‌కు చెందిన మహిళదిగా గుర్తించిన పోలీసులు, బ్యాగ్ పై అడ్రస్ తప్పు రాయడం వల్లే కలకలం రేగిందని అధికారులు తెలిపారు.
బాంబే టు బ్రిస్సేన్ అని రాయబోయి బాంబు టు బ్రిస్సేన్ అని రాశారని గుర్తించారు. బాంబ్ అన్న పదాన్ని కొట్టివేసి అదే పదం కింద మళ్లీ ముంబై అని రాశారని అధికారులు వెల్లడించారు. చిన్న పొరపాటు వల్లన బాంబ్ అనే పదం ఎయిర్ పోర్టులో అందరినీ పరుగులు పెట్టించింది. భారత్ నుంచి బ్రిస్బేన్ చేరుకున్న ప్రయాణికురాలిని స్థానిక పోలీసులు విచారించారు. ఆమె బ్యాగ్‌ను కూడా తనిఖీ చేశారని ఆమె కూతురు పేర్కొన్నది.
- Advertisement -