కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. శిక్షలు ఖరారైన వెంటనే సల్మాన్ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఇవాళ జైల్లోనే గడపాల్సి ఉంటుంది.
ఇక సల్మాన్‌కు బ్యారక్ నెంబర్ 2 గదిని కేటాయించారు. గతంలో ఇదే జైలులో 2006లో సల్మాన్ ఐదు రోజులు గడిపారు. ఇదే బ్యారక్‌లో అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న స్వామిజీ ఆశారాం బాపు ఉంటున్నారు. వీవీఐపీగా సల్మాన్‌ను ట్రీట్ చేయమని చెప్పిన జైలు అధికారులు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను పెంచామని చెప్పారు.
మరోవైపు సల్మాన్‌కు జైలు శిక్ష ఖరారు కావడంతో 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బిష్ణోయిస్ తెగ సంబరాల్లో మునిగితేలింది. కోర్టు బయట బాంబులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.