ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌కు ఆరుగురు తెలుగు కామెంటరీలను బీసీసీఐ ఎంపిక చేసింది. ఐపీఎల్-11 సీజన్ కోసం 100 మంది వ్యాఖ్యతలను బీసీసీఐ నియమించుకుంది. దేశవ్యాప్తంగా ప్రధానంగా మాట్లాడే భాషల్లో మ్యాచులను ప్రసారం చేయడానికి స్టార్ పోర్ట్స్ ఏర్పాట్లు చేసింది. ప్రాంతీయ భాషల్లోనూ ఐపీఎల్ ను ప్రసారం చేయడానికి ప్రముఖ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లను నియమించుకుంది. తెలుగు ప్రేక్షకులను ఐపీఎల్ ను మరింత చేరువ చేసేందుకు కొంతమందిని స్టార్ సంస్థ నియమించుకుంది.
తెలుగు కామెంటరీలుగా వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కల్యాణ్ కృష్ణ, సీ వెంకటేశ్, చంద్రశేఖర్, సుదీర్ మహావాడిలను బీసీసీఐ ఎన్నుకుంది.
ఇంగ్లీష్ కామెంటరీ టీమ్
సునీల్ గావస్కర్, సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్, హర్ష భోగ్లే, శివరామకృష్ణ, రోహన్ గావస్కర్, దీప్ దాస్ గుప్తా, అంజుమ్ చోప్రాతో పాటు మిగతా దేశాలకు చెందిన 24 మంది ప్రముఖ వ్యాఖ్యాతలు వరల్డ్ ఫీడ్ కామెంటరీ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు.
హిందీ కామెంటరీ టీమ్
ఆకాశ్ చోప్రా, వివేక్ రాజ్దాన్, నిఖిల్ చోప్రా, జతిన్ సప్రు, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్, కపిల్ దేవ్, మహ్మద్ కైఫ్, కార్తీక్ మురళీ, ఆర్పీ సింగ్, అభిషేక్ నాయర్, రజత్ బాటియా, ప్రజాన్ ఓజాలను ఎంపిక చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ కామెంటరీగా ఇషా గుహా నిలిచింది. ఏప్రిల్ 7న ముంబై వాఖండే స్టేడియంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభంకానున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.