మాస్ మహారాజా రవితేజ, ఎంటర్ ఎంటర్టైన్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ శ్రీనువైట్ల, క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హోల్ సమ్ ఎంటర్ టైనర్ “అమర్ అక్బర్ ఆంటోనీ”. “నీకోసం, వెంకీ, దుబాయ్ శీను” లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత రవితేజ-శ్రీనువైట్లల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
మార్చిలో శ్రీనువైట్ల కుమార్తెలు ఆనంది, ఆద్యలు క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చేయగా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కామెడీ హీరో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయకి లయ కుమార్తె శ్లోక, రవితేజ కుమారుడు మహాధన్ ల స్పెషల్ రోల్స్ “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
ఇటీవల అమెరికాలో షూటింగ్ మొదలయ్యింది. న్యూయార్క్, కాలిఫోర్నియా, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ లాంటి ఎగ్జాటిక్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రస్తుతం ఒక లాంగ్ ఐల్యాండ్ లో జెన్నిఫర్ లోపెజ్ కి చెందిన పలాటిటల్ హిడెన్ హిల్స్ మ్యాన్షన్ లో జరుగుతొంది. పాప్ దివా అయిన జెన్నిఫర్ లోపెజ్ కు వీరాభిమాని అయిన శ్రీనువైట్ల అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకుంటూ.. “జెన్నిఫర్ లోపెజ్ కి క్రేజీ ఫ్యాన్ ని నేను. మిలియన్ల మందికి హార్ట్ త్రోబ్ అయిన ఎవర్ గ్రీన్ పాప్ క్వీన్ పలాటిటల్ మాన్షన్ లో షూట్ చేయడం అనేది కల ఫలించడం లాంటిది. ఇది నా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్” అన్నారు.
చిత్ర నిర్మాతలు నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ చెరుకూరి మాట్లాడుతూ.. “1700 స్క్వేర్ ఫీట్ లో, 12.5 మిలియన్ డాలర్ల విలువల గల సోఫిష్టికేటెడ్ ఇంటీరియర్స్ అమార్చబడిన కాస్ట్లీయస్ట్ సెలబ్రిటీ హోమ్ అయిన జెన్నిఫర్ లోపెజ్ మ్యాన్షన్ లో షూటింగ్ జరుపుకుంటున్న తొలి తెలుగు సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”.
రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఐ.శ్రీనివాస్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె.కళ్యాణ్-బాలాజీ, కో-డైరెక్టర్: సుభాష్ జెట్టి, చీఫ్ కో-డైరెక్టర్: సీహెచ్ రామారావు, రచన సహకారం: ప్రవీణ్ వర్మ-కొల్లిపార ప్రవీణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం. ఆర్.వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్: విజయ్ సి.దిలీప్, కథ: శ్రీనువైట్ల-వంశీ రాజేష్ కొండవీటి, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం), స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: శ్రీనువైట్ల.