భరత్‌…వచ్చాడయ్యో సామి

211
- Advertisement -

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై స్టార్‌ ప్రొడ్యూసర్‌ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. మహేష్ సరసన బాలీవుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికే సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఏప్రిల్‌ 7న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించనుంది. వచ్చాడయ్యో సామి అనే పాటను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. లుంగీ కట్టుకుని మహేష్ డ్యాన్స్ చేస్తున్న పోస్టర్‌ని విడుదల చేసింది.

Mahesh ... Bharat Anu Nenu  updates

శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన భరత్ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సెకండ్ సింగిల్ ట్రాక్ కూడా ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అఖ్తర్ పాడిన ‘ఐ డోంట్‌ నో’ ట్రెండింగ్‌లో ఉండగా రేపు విడుదల కానున్న పాటపై మరింత అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తోండగా అందరిలో ఆసక్తినెలకొంది.

- Advertisement -