ఒకే అభ్యర్థి..ఒకే నియోజకవర్గం ప్రతిపాదనకు ఈసీ మద్దతిస్తున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఈ మేరకు సుప్రీంలో దాఖలైన అఫిడవిట్‌కు బదులిస్తూ ఒక అభ్యర్థి ఇకపై ఒకేచోట పోటీచేయాలనే ప్రతిపాదనకు గ్రీన్ ఇస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రముఖ నేతలంతా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటంతో అనతికాలంలోనే ఉప ఎన్నికలు వస్తున్నాయని బీజేపీ నేత అశ్వని కుమార్ సుప్రీంను ఆశ్రయించారు.
దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తన వాదనను వినిపించారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్ధానం కేంద్రప్రభుత్వం,ఈసీలకు నోటీసులు జారీ చేసింది. సుప్రీం నోటీసులకు స్పందించిన ఈసీ ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గం ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ప్రధానంగా ప్రధాని అభ్యర్థులు,సీఎం అభ్యర్థులు ఈ పద్దతిని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని వదోదర, యూపీలో వారణాసి నుంచి పోటీ చేసి రెండు స్ధానాల్లో గెలుపొందారు. అయితే అనంతరం వదోదర నియోజకవర్గాన్ని వదులుకోవడంతో కేవలం మూడు నెలలకే 2014 సెప్టెంబర్‌లో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే, గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని వదోదర, యూపీలోని వారణాసి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. రెండు స్థానాల్లో గెలుపొందిన ఆయన వడోదర నియోజకవర్గాన్ని వదులుకోవడంతో మూడు నెలలకే అక్కడ ఉపఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది.