కొత్త జిల్లాల ఆవిర్భావానికి తెలంగాణ ముస్తాబవుతోంది. జిల్లాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాను రేపు ఉదయం 11.12 గంటలకు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సిద్దిపేటలో రేపు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కలెక్టరేట్ నుంచి పాతబస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఇక విజయదశమి రోజున ప్రారంభం కానున్న కొత్త జిల్లాలను ప్రారంభించే మంత్రుల వివరాలను ప్రకటించింది ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటల 13 నిమిషాలకు ఆయా జిల్లాలను మంత్రులు ప్రారంభిస్తారు.
సిద్దిపేట – సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు
జనగాం – స్వామిగౌడ్, మండలి చైర్మన్
జయశంకర్ – మధుసూధనాచారి, స్పీకర్, అసెంబ్లీ
జగిత్యాల – ఎమ్.డి.మహమూద్ అలీ, రెవెన్యూ, డిప్యూటీ సీఎం
వరంగల్ (రూరల్) – కడియం శ్రీహరి, డిప్యూటీ సీఎం
యాదాద్రి – నాయిని నర్సింహా రెడ్డి, హోంమంత్రి
పెద్దపల్లి – ఈటల రాజేంధర్, ఆర్థిక మంత్రి
కామారెడ్డి – పోచారం శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
మెదక్ – పద్మాదేవేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్
మంచిర్యాల – పద్మారావు గౌడ్, ఎక్సైజ్ మంత్రి
వికారాబాద్ – మహీందర్ రెడ్డి, రవాణా మంత్రి
రాజన్న – కేటీఆర్, ఐటీ మంత్రి
ఆసిఫాబాద్ – జోగు రామన్న, బీసీ వెల్ఫేర్ మంత్రి
సూర్యాపేట – జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
కొత్తగూడెం – తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ మంత్రి
నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి
వనపర్తి – నిరంజన్ రెడ్డి, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్
నాగర్ కర్నూలు – జూపల్లి కృష్ణారావు, పరిశ్రమల శాఖ
మహబూబాబాద్ – చందూలాల్, పర్యాటక శాఖ మంత్రి
జోగులాంబ (గద్వాల్) – సి.లక్ష్మారెడ్డి, వైద్యశాఖ మంత్రి
మేడ్చల్ ( మల్కాజిగిరి) – తలసాని శ్రీనివాసయాదవ్, సినిమాటోగ్రఫీ మంత్రి