మహ్మద్ షమీపై మళ్లీ ఆరోపణలు చేసింది అతని భార్య హసీన్ జహన్. గాయాలతో బాధపడుతున్న మహ్మద్ షమీని కలవడానికి వెళ్లా..కానీ అతను నాతో మాట్లాడేందుకు నిరాకరించాడు…కోర్టులోనే చూస్తానంటూ బెదిరించాడని తెలిపింది. చివరి వరకు ఎదరుచూసినా…నాతో మాట్లాడలేదని హసీన్ వెల్లడించింది. అయితే.. కూతురు అయిరాతో మాత్రం కాసేపు మాట్లాడాడని తెలిపింది.
ఇటీవల షమిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు పెట్టడంతో పాటు అక్రమ సంబంధాలు, ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ హసీన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత షమీకి వార్షిక కాంట్రాక్ట్ ఇచ్చేందుకు నిరాకరించిన బీసీసీఐ.. బోర్డు అధికారుల సుదీర్ఘ విచారణ తర్వాత ఇచ్చింది. భార్య ఆరోపణలు, కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈ ఫాస్ట్ బౌలర్ రెండు రోజుల క్రితం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతని తల, చేతికి గాయాలయ్యాయి.
షమీ వ్యక్తిగత జీవితం గురించి బీసీసీఐకి అనవసరమని ఇటీవల వార్షిక కాంట్రాక్ట్‌ని ఇస్తున్న సమయంలో బోర్డు పెద్దలు చెప్పడంతో.. ఐపీఎల్‌లో షమీ ఆడటానికి మార్గం సుగుమమైంది. ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో షమీని రూ.3 కోట్లకి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.