రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా పేసర్ మహ్మద్ షమీని కలవాలనుందని ఆయన భార్య హసీన్ జహాన్ తెలిపింది. నా పట్ల అతడు వ్యవహరించిన తీరుపైనే నా పోరాటం. అతడు శారీరకంగా గాయపడాలని నేను కోరుకోవట్లేదు. షమి ఇక నన్ను భార్యగా కోరుకోక పోవచ్చు. కానీ ఇప్పటికీ నేను అతణ్ని ప్రేమిస్తున్నా. అతడు నా భర్త అని తెలిపింది.
షమికి చెడు జరగాలని తానెప్పుడు కోరుకోనని హసీన్ జహాన్ తెలిపిన సంగతి తెలిసిందే షమి త్వరగా కోలుకోవాలని అల్లాను ప్రార్థిస్తున్నాని…ఆయన తనకు శత్రువు కాదని… ఆరోగ్యంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనని తెలిపింది.
పోలీసు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షమి ఆదివారం బెంగాల్ మాజీ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ అకాడమీలో సాధన చేసి డెహ్రడూన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో షమి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
కొంతకాలంగా షమి,ఆయన భార్యకు గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్, గృహహింస కింద షమిపై హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరుగుతోంది.