చిట్టిబాబుకు ‘చిరు’ కానుక..

253
Chiranjeevi Surprise Gift to Ram Charan Birthday
- Advertisement -

చరణ్ మొదటిసారి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా చేస్తున్న చిత్రం రంగస్థలం. మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ టాక్ తో పాటు ట్రైలర్ ఆడియో కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడం కూడా మెగా ఫ్యామిలిని ఆనందంలో ముంచెత్తుతోంది.

ఎల్లుండి అంటే మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టిన రోజు. ఇలా రెండు సందర్భాలు కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. దీన్ని పురస్కరించుకుని చిరు చరణ్ కు ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వడం ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ కావడం ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.

తనయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఆయన, ఓ గడియారాన్ని కుమారుడికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. “ముందుగా టైమ్ లెస్ గిఫ్ట్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదాలు” అంటూ మెగాస్టార్ చిరంజీవి అనే హ్యాష్ ట్యాగ్ ను తగిలించిన పోస్టును తన ఫేస్ బుక్ ఖాతాలో రామ్ చరణ్ పోస్టు చేశాడు. ఈ ఫోటోలో చిరంజీవితో పాటు ఆయన భార్య సురేఖ కూడా కనిపిస్తున్నారు. కాగా, రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ ఈ వారంలో విడుదలకాబోతుంది.

- Advertisement -