చిట్టిబాబు గెటప్‌లో బన్నీ బాబు ..

272
Allu Arjun Son Allu Ayaan as Rangasthalam Chitti Babu
- Advertisement -

ఇప్పుడు ఉన్న ట్రెండ్‌ను బట్టి చాలా మంది స్టార్ కిడ్స్‌ సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపిస్తు ఫ్యూచర్ స్టార్ అని ట్యాగ్స్ అందుతున్నాయి. అయితే అలాంటి స్టార్‌ కిడ్స్‌లో ప్రస్తుతం ఎక్కువగా పాపులర్ అవుతున్న వారిలో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ ఉన్నాడు. ఈ చిన్న స్టైలిష్ స్టార్ తండ్రికి తగ్గట్టుగానే క్యూట్ స్టైల్ తో కనిపిస్తుంటాడు. తల్లి స్నేహ రెడ్డి ఇన్ స్టాగ్రామ్‌లో మనోడి ఫొటోలు చాలానే షేర్‌ చేస్తుంది.

Allu Arjun Son Allu Ayaan as Rangasthalam Chitti Babu

అంతేకాదు స్టైలీష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నెట్టింట్లో ఎప్పుడూ చాలా చురుగ ఉంటాడు. సందర్భానికి తగినట్టుగా ఆయన తన పిల్లల ఫోటోలను షేర్ చేయడంలోనూ ముందుంటాడు. తాజాగా ఆయన తనయుడు అల్లు అయాన్ ఫోటో ఒకటి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో అల్లు అయాన్ ‘రంగస్థలం’ సినిమాలో ‘చిట్టిబాబు’ మాదిరిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడ నెట్టింట్లో ఈ ఫోటో హల్‌చల్‌ చేస్తోంది.

రంగస్థలం’ సినిమాలో చరణ్ .. ‘చిట్టిబాబు’ పాత్రను పోషించాడు. ఈ పాత్రలో ఆయన గళ్ల లుంగీ పైకి కట్టి .. గళ్ల చొక్కా . . రంగు బనీన్ తో మెడలో టవల్ వేసుకుని కనిపిస్తాడు. అల్లు అర్జున్ దంపతులు అల్లు అయాన్ కి అలాంటి బట్టలే వేసి .. అతణ్ణి ‘చిట్టిబాబు’ లుక్ తో అభిమానుల ముందుంచి తమ ముచ్చట తీర్చుకున్నారు. ఇక తమ అభిమాన హీరో అల్లు అర్జున్ తనయుడిని ‘చిట్టిబాబు’ లుక్ లో చూస్తూ ఆయన అభిమానులు మురిసిపోతున్నారు.

- Advertisement -