ఫేస్‌బుక్కైంది…డిలీట్‌ చెయ్యాలట..!

186
- Advertisement -

అవును…’ఫేస్‌బుక్‌’ బుక్కైపోయింది. దాంతో ఒక్కసారిగా ఆ సంస్థ షేర్లు ఢమాల్ న పడిపోయాయి. దాంతో జూకర్‌బర్గ్‌ కు 5.1 బిలియన్‌ డాలర్లు అంటే..సుమారు రూ.33వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ పరిణామంతో తల పట్టుకున్నట్టైన మార్క్‌ జూకర్‌ బర్క్‌ కు మరో షాకిచ్చినంత పని చేశాడు వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రేన్‌ ఆక్టన్‌.

WhatsApp co-founder wants everyone to delete their Facebook accounts...

‘ఇది ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం’ అంటూ ట్వీట్‌ లో సంచలన వ్యాఖ్యలు చేశారు బ్రేన్‌. బ్రేన్‌ ఇలాంటి ట్వీట్‌ చెయ్యడానికి కారణం..ఫేస్‌బుక్‌ లో కోట్లాది యూజర్ల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవడమే. కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థ ఈ దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపణలు వెల్లువెత్తాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నిలకల్లో కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థకు దాదాపు 5కోట్ల మంది సమాచారం చిక్కిందని వార్తలొచ్చాయి. ఈ లీక్‌లపై పూర్త విచారణ జరిపించాల్సిందేనంటూ..అమెరికా సహా బ్రిటన్‌ ఈయూ దేశాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఈ లీక్‌ల పై విచారణ ఇవ్వాలంటూ..జూకర్‌బర్క్ కు బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ నోటీసులు పంపింది.

  WhatsApp co-founder wants everyone to delete their Facebook accounts...

ఇక ఇప్పటికే సోషల్‌ మీడియాలో ‘డిలీట్‌ఫేస్‌బుక్‌’ హ్యాష్‌ట్యాగ్‌ వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బ్రేన్‌ కూడా ఇదే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్‌ చేశారు.

ఇదిలాఉండగా..బ్రేన్‌ ఆక్టన్..జాన్‌ కౌమ్‌తో కలిసి వాట్సాప్‌ను ప్రారంభించాడు. అయితే గతేడాదే ఆ సంస్థనుంచి వైదొలిగిన బ్రేన్‌..మరో ఫౌండేషన్‌ కోసమే వాట్సాప్‌ ను వీడినట్టు ఆ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

- Advertisement -