- Advertisement -
ప్రజలందరికీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. హేవిళంబినామ సంవత్సర ఉగాది వేడుకలు హైదరాబాద్ లోని రాజ్ భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రజలంతా సుఖశాంతులతో వర్థిల్లాలని సీఎం కేసీఆర్ కోరారు.
తెలుగు ప్రజలు ఉగాదిని ఘనంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు. నరసింహన్ గవర్నర్‌గా వచ్చిన తర్వాత రాజ్‌భవన్‌లో ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలు జరుపుతున్నారన్న సీఎం.. పండుగలను ఆచరిస్తున్న గవర్నర్‌కు తెలుగు ప్రజల తరుపున ధన్యవాదాలు తెలియజేశారు.
కాగా.. గవర్నర్ నరసింహన్ దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేసీఆర్ పాటు ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు,మఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- Advertisement -