‘వైశాఖం’.. అవార్డులు రావడం హ్యాపీగా ఉంది..

262
Dynamic Lady Director Jaya Spech
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, వి టీమ్‌, జె వరల్డ్‌ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. వి టీమ్‌ సీఈఓ వీరూ మామ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఎ.పి. పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ పి.ఎస్‌.నాయుడు, ప్రముఖ నటులు శరత్‌కుమార్‌, నరేష్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి., గంటా నారాయణమ్మ ట్రస్టు ఛైర్‌పర్సన్‌ గంటా శారద, సురక్ష హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రఘు, నిర్మాత వర్మ రాజు, దర్శకుడు జగదీశ్‌ దానేటి, వీజేఎఫ్‌ అధ్యక్షుడు శ్రీనుబాబు, హీరో గంటా రవితేజ, ‘వైశాఖం’ చిత్ర నిర్మాత బి.ఎ.రాజు, నారాయణ గ్రూప్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ శరణి గంటా తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో అత్యద్భుత ప్రతిభను కనబరిచిన 13 మంది మహిళలకు ఐడబ్ల్యుడిఎ పురస్కారాలను అందజేశారు.

Dynamic Lady Director Jaya Spech

సీనియర్‌ నటి, దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన శ్రీమతి విజయనిర్మలకు జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఈ అవార్డును విజయనిర్మల తరఫున ఆమె తనయుడు నరేష్‌ స్వీకరించారు. దర్శకత్వ విభాగంలో ఐడబ్ల్యుడిఎ అవార్డును డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి., సంప్రదాయ నాట్యంలో అమెరికాకు చెందిన సీత మాడభూషి, నటి సన, సంగీతంలో అమెరికాకు చెందిన పద్మినీ కచ్చపి, శాంతిమార్గంలో దుబాయ్‌కు చెందిన నజరత్‌ హజాన్‌, సంఘ సేవకురాలు హారిక కొలివెలిసి, సినీ నేపథ్యగాయని కల్పన, బుల్లితెర నటి పల్లవి, సంఘ సేవకురాలు చిన్నారి కలశ మేడపురెడ్డి, అడ్వాన్స్‌డ్‌ ఎడ్యుకేషన్‌ మార్చినా డి క్రూజా, స్టీల్‌ప్లాంట్‌ ట్రాఫిక్‌ పోలీసు జి.లక్ష్మీ, నటి సమలినీ పోన్సికా, వ్యవసాయంలో శ్రీదేవి వర్మదాట్లలకు వీటిఎం జీవన సాఫల్య పురస్కారాలను అతిథుల చేతులమీదుగా ప్రదానం చేశారు. జ్ఞాపికలతో పాటు మహానటి సావిత్రి పుస్తకాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

Dynamic Lady Director Jaya Spech

ఈ సందర్భంగా నటుడు శరత్‌కుమార్‌ మాట్లాడుతూ – ”అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనందంగా వుంది. వచ్చే ఏడాది నిర్వహించే వేడుకల్లో సతీమణి రాధికతో కలిసి హాజరవుతాను” అన్నారు.

రాష్ట్ర మహిళా కమీషన్‌ ఛైర్‌ పర్సన్‌ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ – ”గత ఏడాది లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డును తీసుకున్నా నేను ఈ ఏడాది సీనియర్‌ నటి, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల తరపున ఆమె తనయుడు నరేష్‌కు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లోనూ సమానమేనని.. అందుకు ఈ కార్యక్రమంలో అవార్డులు స్వీకరిస్తున్న ఈ మహిళలే ఉదాహరణ” అన్నారు.

Dynamic Lady Director Jaya Spech

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. మాట్లాడుతూ – ”మా అందరికీ ఇన్‌స్పిరేషన్‌ అయిన విజయనిర్మలకి లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందదాయకం. విజయనిర్మల తరఫున నరేష్‌ ఈ ఫంక్షన్‌కి రావడం చాలా హ్యాపీగా ఉంది. విజయనిర్మలకి లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు వచ్చిన ఈ ఫంక్షన్‌లో దర్శకురాలిగా ఐడబ్ల్యుడిఎ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో ఇష్టమైన నన్నపనేని రాజకుమారి, శరత్‌కుమార్‌, నరేష్‌ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఇంతకుముందు నా సినిమాల షూటింగ్‌ విశాఖపట్నంలో చేశాం. నా నెక్స్‌ట్‌ సినిమా కూడా ఇక్కడ షూటింగ్‌ చెయ్యబోతున్నాను. విశాఖ ప్రజల సమక్షంలో, ఇంతమంది ప్రతిభావంతులైన మహిళల మధ్య అవార్డు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి. నేను ఎన్నో సినిమాలు చేసినా ‘వైశాఖం’ సినిమాకి ఎక్కువ అప్రిషియేషన్‌, ఎక్కువ అవార్డులు వస్తున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా జ్యూరీ సభ్యులు నన్ను అవార్డుకు ఎంపిక చేయడం హ్యాపీగా వుంది. ఎన్నో అవార్డులు అందుకున్నప్పటికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో జీవన సాఫల్య అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా వుంది ” అన్నారు.

Dynamic Lady Director Jaya Spech

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి, విజయనిర్మల తనయుడు డాక్టర్‌ నరేష్‌ మాట్లాడుతూ – ”వృత్తిపరంగా విశాఖ నాకు తల్లిలాంటిది. జంధ్యాల దర్శకత్వంలో ‘నాలుగు స్తంభాలాట’ తొలి షాట్‌ను విశాఖలోనే చిత్రీకరించారు. తర్వాత రెండు జెళ్ళ సీత, జంబలకిడి పంబ, శ్రీవారికి ప్రేమలేఖ తదితర చిత్రాలు విశాఖలో షూటింగ్‌ జరుపుకోవడమే కాకుండా సూపర్‌హిట్‌గా నిలిచాయి. అమ్మ విజయనిర్మల అనారోగ్యం కారణంగా అవార్డును తీసుకునేందుకు రాలేకపోయారు. అందుకే నేను వచ్చాను. నేను ఈ స్థానంలో ఉండడానికి మా అమ్మ విజయనిర్మల, కృష్ణ, విశాఖ ప్రజలే కారణం” అన్నారు.

- Advertisement -